మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగ జీవితం ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. నిరుద్యోగులకు మంచి సంస్థలు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) ఈ రాశి వారికి ఈ వారం అన్ని విధాల అనుకూలంగా ఉంది. కొద్దిగా అదృష్టం కలిసి వస్తుంది. కుటుంబ జీవితంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆదాయం పెంచుకునేందుకు ఆలోచన చేస్తారు
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) ఈ వారం మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఇబ్బందుల్లో ఉన్న బంధువులకు ఆర్థిక సహాయం చేస్తారు. దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొద్దిగా అనారోగ్యంతో అవస్థ పడే సూచనలున్నాయి
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. బంధుమిత్రులలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సంపాదన స్థిరంగా ఉంటుంది.వివాహ ప్రయత్నాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. విదేశాల నుంచి ఆశించిన కబురు అందుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) మొండి బాకీ ఒకటి అనుకోకుండా వసూలు అవుతుంది. చాలా కాలంగా పీడిస్తున్న ఓ వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) అన్ని విధాలుగాను కలిసివచ్చే కాలం ఇది. రావాల్సిన డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. దీర్ఘకాల వ్యాధులు ఉన్నవారు కొద్దిగా ఉపశమనం పొందుతారు. ఆదాయం బాగానే ఉంటుంది కానీ అనవసర ఖర్చులు అదుపు తప్పుతాయి. ఉద్యోగ పరంగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) గ్రహ సంచారం అనుకూలంగా లేనందువల్ల కొన్ని వ్యక్తిగత విషయాల్లో ఇబ్బందులు పడతారు. మంచి మాట్లాడినా చెడుగా అర్థం చేసుకునే వారు ఉంటారు. వివాహ ప్రయత్నాలు కాస్తంత అనుకూలంగా ఉంటాయి. ద్యోగ ప్రయత్నాల్లో ముందడుగు వేస్తారు. ఐటీ నిపుణులకు విదేశాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ) ఒకటి రెండు కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి. అయితే, ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. అనవసర ఖర్చులు ఇబ్బంది కలిగిస్తాయి. డబ్బు నష్టం జరుగుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) వృత్తి నిపుణులకు, ఉద్యోగులకు, వ్యాపారులకు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. భాగస్వాములతో ప్రధాన సమస్యలను పరిష్కరించుకుంటారు. కొందరు స్నేహితులు అపార్ధాలతో దూరమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో పని ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2) ఈ వారం మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఉద్యోగ జీవితం సాఫీగానే సాగిపోతుంది. కొత్త ఆఫర్లు మీ ముందుకు వస్తాయి. పిల్లలు చదువులోనూ, ఉద్యోగ ప్రయత్నాలలోనూ విజయం సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు విసుగు పుట్టిస్తాయి
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) ఒకటి కంటే మించి ఆఫర్లు వస్తాయి. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది కానీ అందుకు తగ్గట్టుగా ఖర్చులు కూడా పెరుగుతాయి. అదనపు ఆదాయం కోసం ఆరాటం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆర్థికంగా బాగా ఒత్తిడి ఉంటుంది
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) ప్రధాన గ్రహాల స్థితిగతులు మీకు ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉన్నాయి. ఊహించని విధంగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి ఉద్యోగాలు ప్రశాంతంగా ముందుకు సాగుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లలు చదువుల్లో విజయాలు సాధిస్తారు