ఎండోక్రైన్ గ్రంథుల నుంచి హార్మోన్లు స్రవిస్తాయి. ఇది మీ జీవక్రియను పెంచడం నుంచి పునరుత్పత్తి వరకు ప్రతిదీ నియంత్రిస్తుంది

అయితే హార్మోన్ల అసమతుల్యత అనేది మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. దీనివల్ల కొన్ని అవయవాల పనితీరు సరిగ్గా ఉండదు

అందువల్ల కొన్ని ఆహారాలను అవైడ్ చేయాల్సి ఉంటుంది. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం

మటన్, పంది మాంసం, గొడ్డు మాంసం వంటి రెడ్ మీట్‌లో హైడ్రోజనేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉండటం వలన హార్మోన్ల అసమతుల్యతను మరింత తీవ్రతరం చేస్తుంది

కాలీఫ్లవర్, బ్రోకలీ, కాలే వంటి క్రూసిఫెరస్ కూరగాయలు అధికంగా తీసుకుంటే మంటను కలిగించవచ్చు

ఈ కూరగాయలను ఎక్కువగా తీసుకోవడం వల్ల థైరాయిడ్ గ్రంధి ప్రభావితం అవుతుంది. ఇది హార్మోన్లలో అసమతుల్యతకు దారితీస్తుంది

ప్రాసెస్ చేసిన ఆహారాలు ప్యాక్ చేసిన, ప్రాసెస్ చేసిన ఆహారాలు తినడం సులభం. కానీ ఇవి హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతాయి