చేపముక్కలను పావుగంట పాటు ఉప్పు నీళ్లలో నానబెడితే ఆ తర్వాత కూర చేస్తే  నీచు వాసన రాదు

వెండి వస్తువులు తళ తళలాడాలంటే శానిటైజర్‌ వేసి తుడిస్తే కొత్తవాటిలా మెరుస్తాయి

నూలు వస్రాలు కొత్తవాటిలా మెరవాలంటే నీళ్లో రెండు కప్పుల వెనిగర్‌ వేసి జాడించాలి

జీడిపప్పు ఎక్కువకాలం తాజాగా ఉండాలంటే సీసాలో కొన్ని లవంగాలు ఉంచితే సరి

ఇడ్లీలకి మినప్పప్పు రుబ్బుతున్నప్పుడు కాసిన్ని మెంతులు వేసి రుబ్బితే ఇడ్లీలు మృదువుగా వస్తాయి