రోజూ SPF 15 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న లిప్‌బామ్‌ను పెదాలకు అప్లై చేసుకొని బయటకి వెళ్ళాలి
విటమిన్-ఎ ఉన్న లిప్‌బామ్‌లు, లిప్‌క్రీమ్‌లు తరచూ వాడటం వల్ల పిగ్మెంటేషన్ సమస్యను తగ్గించడం తగ్గుతుంది
రాత్రి పడుకునే ముందు పెదాలకు ఆలివ్ ఆయిల్ రాసుకుంటే పొడిబారిపోయి పాలిపోయిన పెదాలకు తేమనందిస్తుంది
కలబంద గుజ్జును రోజూ రాత్రి పూట పెదాలపై కాసేపు మర్దన చేస్తే చర్మానికి తేమ అంది పెదాలు మృదువుగా మారతాయి
సమస్య తగ్గే వరకూ పెదాలపై తేనె అప్లై చేసుకొని రాత్రంతా ఉంచుకొని మరుసటి రోజు చల్లటి నీళ్లతో కడిగితే ఫలితం ఉంటుంది
నిమ్మరసం, బీట్‌రూట్ రసం లాంటివి పెదాలపై అప్లై చేయడం వల్ల లిప్ పిగ్మెంటేషన్ సమస్య నుంచి ఉపసమనం కలుగుతుంది
బీస్‌వ్యాక్స్, షియా బటర్ వంటివి పడుకునే ముందు పెదలపై అప్లై చేయడం వల్ల పెదాలకు పోషణ లభించి సమస్య తగ్గుముఖం పడుతుంది