నిమ్మకాయ ఉపయోగం ఆరోగ్యానికి మాత్రమే పరిమితం కాదు.. ఇంట్లోని చాలా సమస్యలకు చెక్ పెడుతుంది

ఫ్రిజ్ నుంచి దుర్వాసనలు తొలగించడానికి నిమ్మకాయం ఎంతగానో ఉపయోగపడుతుంది

బట్టలపై పడిన మరకలపై నిమ్మరసం పిండి చిటికెడు ఉప్పు  కలపండి. వాష్ చేసే ముందు కొన్ని గంటల పాటు  అలానే ఉంచి వాష్ చేయండి.

యాపిల్ ముక్కలు ఎర్రగా మారితే నీటిలో కొన్ని చుక్కల  నిమ్మరసం పిండి అందులో యాపిల్ ముక్కల్ని ఉంచండి యాపిల్ తాజాగా మారుతుంది

చుండ్రును తొలగించడానికి.. మీ తలకు నిమ్మరసం అప్లై చేసి, 10 నిమిషాల పాటు అలాగే ఉంచి యాంటీ-డాండ్రఫ్ షాంపూతో కడిగేయండి.

 కప్పు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయను పిండి వేళ్లను 5 నిమిషాలు నానబెట్టండి. దీంతో నెయిల్ పాలిష్ పూర్తిగా తొలగిపోతుంది

ఒక గిన్నెలో నీటిని తీసుకుని దానికి నిమ్మకాయ తొక్కల్ని జతపర్చండి ఆ నీటిని మైక్రోవేవ్ లో ఉంచండి. ఆ తర్వాత అదే నీటితో మైక్రోవేవ్ ను శుభ్రం చేయండి.