ప్రతి రోజూ నిద్రపోయే ముందు రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు నమిలి మింగాలి
గోరువచ్చని నీటితో నిమ్మరసం కలపుకోవాలి. చక్కెరకు బదులు తేను వాడితే చాలా మంచిది
భోజనం నుంచి తెల్ల బియ్యంతో చేసిన అన్నాన్ని తగ్గించండి. దానికి బదులు రెడ్ రైస్, గోధుమ బ్రెడ్, ఓట్స్ బ్రెడ్‌తో భోజనం చేయండి.
వంటల్లో దాల్చిన చెక్క, అల్లం, నల్ల మిరియాలు, పచ్చి మిర్చి ఉండేలా చూసుకోండి
ప్రతి రోజు ఉదయం, మధ్యాహ్నం తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను తింటే మంచిది.
మంచి నీటిని ఎక్కువగా తాగాలి. నీటిని ఎక్కువగా తాగితే మెటబాలిజం రేటు పెరుగుతుంది. శరీరం నుంచి మలినాలు బయటకు వెళ్లిపోతాయి.