ముక్కు నుంచి రక్తం కారుతుందని చాలా మంది చెబుతుంటారు

ఇది ఎక్కువ వేడి పదార్థాలను తీసుకోవడం, అధిక వేడిలో ఉండటం వల్ల ఈ సమస్య రావచ్చు అంటున్నారు వైద్య నిపుణులు

ఈ సమస్య రావడం సర్వసాధారణం. కానీ రక్తస్రావం పదే పదే జరుగుతూ ఉంటే అప్పుడు వైద్యుడిని సంప్రదించండి

ముక్కు నుండి రక్తం కారడాన్ని ఆపడానికి మీరు కొన్ని ఇంటి నివారణ చిట్కాలను పాటించవచ్చు

ఎండలో నడవడం వల్ల ముక్కు నుంచి రక్తం కారితే తలపై చల్లటి నీళ్లు పోసుకుంటే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు

కొత్తిమీర ఆకులను పేస్ట్ చేయండి. ఈ పేస్ట్‌ను నుదుటిపై రాయండి

కొత్తిమీర చల్లగా ఉంటుంది. ఎంతో ఉపశమనం ఉంటుంది

రక్తస్రావం ప్రాంతంతో కొంతసేపు ఐక్‌ ముక్కను ఉంచడం వల్ల కొంత సమయం తర్వాత ముక్కు నుంచి రక్తం కారడం ఆగిపోతుంది