నిద్ర సరిగా పట్టకపోవడం, ఒత్తిడి వంటి కారణాల వల్ల చాలా మంది డార్క్ సర్కిల్స్ సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది

ఈ పరిస్థితిలో మీరు నల్లటి వలయాలను వదిలించుకోవడానికి కొన్ని ఇంటి చిట్కాలని ప్రయత్నించవచ్చు

 దీని కోసం ఒక చెంచా టమోటా రసంలో ఒక చెంచా నిమ్మరసం కలపండి. డార్క్ సర్కిల్ మీద 10 నిమిషాలు అప్లై చేయండి

ఆ తర్వాత చల్లటి నీటితో కడిగితే సరిపోతుంది

బంగాళదుంపని తీసుకొని బాగా కడిగి దానిని గుండ్రంగా కట్‌ చేయండి. ఆ ముక్కలని డార్క్ సర్కిల్ మీద పెట్టుకోండి

10 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి

కొన్ని చుక్కల నారింజ రసం, గ్లిజరిన్ మిక్స్ చేసి డార్క్ సర్కిల్స్‌పై అప్లై చేయాలి. ఇది డార్క్ సర్కిల్స్ ను తొలగిస్తుంది

చల్లటి పాలు తీసుకొని అందులో కాటన్‌ ముంచి డార్క్‌ సర్కిల్స్‌పై అప్లై చేయాలి. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగితే సరిపోతుంది