చలికాలంలో పగిలిన పెదాలను మృదువుగా చేయడానికి మీగడలో చిటికెడు పసుపు మిక్స్ చేసి రాత్రి పడుకునేటప్పుడు పెదవులకు రాసుకోవాలి

దీంతో పగిలిన పెదాలు కొద్దిరోజుల్లో గులాబీ రంగులోకి మారుతాయి

గులాబీ ఆకులను గ్రైండ్ చేసి అందులో నిమ్మకాయ, తేనె కలపాలి. నిద్రపోయేటప్పుడు పెదవులపై అప్లై చేయాలి

వాసెలిన్‌లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి ప్రతిరోజూ రాత్రి పడుకునే సమయంలో అప్లై చేయాలి

దీంతో మీ పెదవుల పగిలిన సమస్య నయమవుతుంది. అలాగే పెదవుల నలుపు కూడా తొలగిపోతుంది

ఈ సమస్యను నివారించడానికి ప్రతిరోజూ నీరు తాగాలి. తద్వారా పెదవులలో తేమ అలాగే ఉంటుంది

కొద్ది రోజుల్లో సమస్య తీరిపోతుంది. కావాలంటే పెదవులపై తేనె కూడా రాసుకోవచ్చు