‘ఆర్ఆర్ఆర్’తో రామ్ చరణ్ పేరు అంతర్జాతీయ స్థాయిలో వినబడుతోంది. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ అమెరికా లో హాలీవుడ్ ని చుట్టేస్తున్నాడు.
ఆర్ఆర్ఆర్ మూవీకి బ్రాండ్ అంబాసిడర్ గా రామ్ చరణ్ వరుస ఇంటర్వ్యూలు, టీవీ షోలు, సెలబ్రిటీలతో చిట్‌చాటింగ్ లతో బిజీ గా ఉన్నాడు.
‘గుడ్ మార్నింగ్ అమెరికా’ షోలో తొలుత పాల్గొన్న రామ్ చరణ్. ఆ తర్వాత ఏబీసీ న్యూస్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు.
ఇప్పుడు కేటీఎల్ఏ న్యూస్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అక్కడే ‘బ్రాడ్ పిట్ ఆఫ్ ఇండియా’ చరణ్ అనే పిలుపు వినిపించింది.
అక్కడున్న హోస్టులు ఇంటర్వ్యూ చేస్తూ.. రామ్ చరణ్‌ని ‘ బ్రాడ్ పిట్ ఆఫ్ ఇండియా ‘ అంటూ కాంప్లిమెంట్స్ ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది.
ఇక హోస్ట్ ఇచ్చిన ఈ కాంప్లిమెంట్స్‌కి చిరునవ్వుతోనే స్పందించిన రామ్ చరణ్.. ఐ లైక్ బ్రాడ్ పిట్ అంటూ రిప్లై ఇచ్చాడు.
రామ్ చరణ్‌కి వచ్చిన ఈ కాంప్లిమెంట్స్‌ని చరణ్ కన్నా ఎక్కువ అతడి అభిమానులే సెలబ్రేట్ చేసుకుంటున్నారు.