జెండాను ఎగరవేసేటప్పుడు చిరిగిపోయి ఉండకూడదు
నలిగిపోయిన, తిరగబడిన జెండాను ఎగరవేయరాదు. దుస్తులుగా కుట్టించుకోకూడదు
జాతీయ జెండాను ఎగరవేసే ఎత్తులో లేదా అంతకంటే ఎక్కువ ఎత్తులో మరే ఇతర జెండా ఎగరవేయరాదు
జెండాను ఎలాంటి అలంకరణకు ఉపయోగించకూడదు. జెండాపై ఎలాంటి రాతలు ఉండకూడదు
జెండాను ఎగరవేసేటప్పుడు కాషాయ రంగుపైకి ఉండేలా చూడాలి
స్తంభం మీదా లేదా జెండాపైన పూలు, ఆకులు, దండలు పెట్టరాదు
జెండాను ఏ వస్తువు మీద కప్పడానికి ఉపయోగించకూడదు
జాతీయ జెండా నేలమీద పడేయకూడదు. నీటిపై తేలనీయకూడదు