అంగ్ కోర్ వాట్ ఆలయం కాంబోడియాలో ఉంది. క్రీస్తుశకం వెయ్యి శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత ఖ్మేర్ సామ్రాజ్యంలో భాగం

సామ్రాజ్యం రాజధాని నగరం పేరు కూడా అంగ్ కోర్. ముందుకు ఈ సామ్రాజ్యాన్ని ఇతరులు పాలించారు. అవంతరం హిందూ రాజుల పరిపాలనలోకి వచ్చింది

అంగ్ కోర్ వాట్ ఆలయాన్ని నిర్మించిన రాజు పేరు సూర్యవర్మన్-2. ఆయన విష్ణుమూర్తి ఆరాధకుడు

అంగ్ కోర్ వాట్ ను కేవలం ఒక్క దేవాలయంగా చెప్పలేం. ఇక్కడ, చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని వందల దేవాలయాలు ఉన్నాయి

అంగ్ కోర్ వాట్ అంటే దేవాలయాల నగరం అని అర్థం.క్రీస్తు శకం 1113 సంవత్సరం నుంచి 1150 సంవత్సరాల మధ్య దీనిని నిర్మించినట్టు చరిత్రకారులు నిర్ధారించారు

ప్రపంచంలోనే అన్ని మతాలకు సంబంధించి కూడా అంగ్ కోర్ వాట్ దేవాలయం అతిపెద్దది కావడం గమనార్హం

అంగ్ కోర్ వాట్ ప్రధానంగా విష్ణుమూర్తి ఆలయం. ప్రధాన ఆలయంలోని అతిపెద్ద రాజగోపురం కింద ఉన్న గదిలో భారీ విష్ణుమూర్తి విగ్రహం ఉంటుంది

ప్రధాన గోపురం కింది గదుల్లో ఖ్మేర్ సామ్రాజ్యం నాటి పరిస్థితులతో పాటు రామాయణ, మహాభారత గాథలకు సంబంధించిన పెయింటింగులు ఉన్నాయి