మీరు ఎవరితోనైనా మాట్లాడినప్పుడు, మీరు సంభాషణలో కృతజ్ఞతలు, ధన్యవాదాలు మొదలైనవాటిని తప్పనిసరిగా ఉపయోగించాలి
అయితే కృతజ్ఞతలు అనే పదం ఎక్కడ నుండి వచ్చిందో మరియు దానిని ఉపయోగించాల్సిన సరైన మార్గం ఏమిటో మీకు తెలుసా
ఇది థాంకోజన్ అనే జర్మన్ పదం నుండి ఉద్భవించినట్లు అనేక నివేదికలు చెబుతున్నాయి
ఈ పదాం కాలక్రమేనా థ్యాంక్యూ గా పరిణామం చెందింది. చిన్నగా కనిపించే పదం పెద్ద ప్రభావాన్ని చూపుతుంది
చాలా నిఘంటువులలో ధన్యవాదాలు, కృతజ్ఞతలకు సంబంధమే లేదని, ఈ రెండు పదాలకు అర్థం వేరని పేర్కొనడం జరిగింది
థాంక్స్ అనే పదం థింక్ అనే పదం నుండి రూపొందించబడింది. థింక్ అంటే, ‘నువ్వు నా కోసం ఏం చేశావో నేను గుర్తుంచుకుంటాను’ అని అర్థం
ఎవరికైనా అధికారికంగా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటే థాంక్స్, థ్యాంక్యూ, థ్యాంక్యూ వెరీ మచ్ వంటి మొదలైన పదాలను ఉపయోగించి నేరుగా చెప్పవచ్చు
అనధికారికంగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటే.. థాంక్స్ ఎ బంచ్, థ్యాంక్స్ ఎ బిలియన్ మొదలైన పదాలను ఉపయోగించవచ్చు