చాలాకాలం క్రితం ఇక్కడి చెరువు సమీపంలో ఒక పెద్ద పాముపుట్ట ఉండేదట

దివ్యమైన తేజస్సు గల ఒక సర్పం ఆ పుట్టలోకి వెళ్లడం .. రావడం చాలామంది చూసేవాళ్లు

ఆ తర్వాత కాలంలో చెరువులో నీరు పెరగడం వలన పుట్టకరిగిపోయింది

ఆ తర్వాత కొన్ని రోజులకు చెరువులో గతంలో పుట్ట ఉన్న ప్రదేశంలో ఏకశిలపై శ్రీ వల్లీదేవసేనాసమేత సుబ్రహ్మణ్య స్వామి వారి  విగ్రహం బయట పడింది

ఈ విగ్రహం సుమారు రెండు అడుగుల ఎత్తుతో స్పష్టి ఆకృతితో తేజరిల్లుతుంటాడు

అది స్వామివారి మహిమగా భావించిన గ్రామస్తులు, ఆలయాన్ని నిర్మించారు

స్వామివారి దేహం సర్పంవలె పొలుసులతో కూడి వుండటం ఈ విగ్రహం యొక్క ప్రత్యేకతగా చెబుతుంటారు

అత్తిలి వాసులకు శ్రీ వల్లీదేవసేనాసమేత సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆరాధ్య దైవం

అత్తిలి షష్ఠి అంటే ప్రతి యాత్రికుడికి ప్రీతి. ఇక్కడ షష్టి ఉత్సవాలు చాలా ప్రత్యేకంగా నిర్వహిస్తారు