ఫిఫా ప్రపంచ కప్ 2022లో వీరి సంపాదన చూస్తే కళ్లు తిరగాల్సిందే..
ఫిఫా ప్రపంచ కప్‌లో టీంల అద్భుతమైన ఆట, వారి నిర్వాహకుల తోడు లేకుండా సాధ్యం కాదు.
ఆటగాళ్లతో పాటు టీం మేనేజర్లు కూడా అత్యధికంగా సంపాదించే జాబితాలో చోటు దక్కించుకున్నారు.
టీంలు తమ మేనేజర్లపై కోట్లాది రూపాయాలు వెచ్చించడానికి కూడా ఇదే కారణం.
ఫిఫాలో అత్యధికంగా సంపాదించే మేనేజర్ల గురించి తెలుసుకుందాం.
హన్సి ఫ్లిక్ జర్మనీ జట్టుకు మేనేజర్. అతను మేనేజర్‌గా గరిష్టంగా రూ. 54 కోట్లు సంపాదిస్తున్నాడు.
ఇంగ్లండ్ టీం మేనేజర్ గారెత్ సౌత్ గేట్ దాదాపు రూ. 48 కోట్లు తీసుకుంటున్నాడు. అతను జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.
డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ మేనేజర్ డిడియర్ డెషాంప్స్ దాదాపు రూ. 32 కోట్లు సంపాదిస్తున్నాడు.
ఫిఫా ప్రపంచ కప్‌లో బ్రెజిల్ జట్టుకు టైట్ ముందుకు నడిపిస్తున్నాడు. మేనేజర్‌గా ఏటా దాదాపు రూ. 30 కోట్లు సంపాదిస్తున్నాడు.
నెదర్లాండ్స్ మేనేజర్ లూయిస్ వాన్ గాల్ 5వ స్థానంలో ఉన్నాడు. మేనేజర్‌గా దాదాపు రూ.25 కోట్లు అందుకుంటున్నాడు.