యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ సిటిజన్లకు మూడేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.30 శాతం వడ్డీని అందిస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకులలో, ఈ రుణదాత ఉత్తమ వడ్డీ రేట్లను అందిస్తుండగా.. పెట్టుబడి పెట్టిన రూ.లక్ష మూడేళ్లలో రూ.1.24 లక్షలకు పెరుగుతుంది.
యాక్సిస్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు మూడేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.05 శాతం వడ్డీని అందిస్తోంది. పెట్టుబడి పెట్టిన రూ.లక్ష మొత్తం మూడేళ్లలో రూ.1.23 లక్షలకు పెరుగుతుంది.
ఇండస్‌ఇండ్ బ్యాంక్, యస్ బ్యాంక్ తో పాటు సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్‌ల కోసం మూడేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.50 శాతం వడ్డీని అందిస్తున్నాయి. పెట్టుబడి పెట్టిన రూ.లక్ష మొత్తం మూడేళ్లలో రూ.1.25 లక్షలకు పెరుగుతుంది.
ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు మూడేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.90 శాతం వడ్డీని అందిస్తోంది. పెట్టుబడి పెట్టిన రూ.లక్ష మొత్తం మూడేళ్లలో రూ.1.26 లక్షలకు పెరుగుతుంది.
సీనియర్ సిటిజన్లు యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌తో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై గరిష్టంగా 8.3% వడ్డీని పొందవచ్చు . సీనియర్ సిటిజన్లకు 366 రోజుల డిపాజిట్లపై ఈ వడ్డీ రేటు వర్తిస్తుంది.
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గరిష్ట పెట్టుబడి రాబడిని పొందడంలో సహాయపడటానికి ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను ఇటీవల పెంచింది. ఏయూ బ్యాంక్ రిటైల్ డిపాజిట్ల కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను 60 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. సాధారణ కస్టమర్లకు 6.9 శాతం నుండి 7.5 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.4 శాతం నుండి 8 శాతానికి వడ్డీ రేట్లను పెంచింది.
డిసిబి బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు మూడేళ్ల మూడేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8 శాతం వడ్డీని అందిస్తోంది. ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఈ సంస్థ ఉత్తమ వడ్డీ రేట్లను అందిస్తోంది. పెట్టుబడి పెట్టిన రూ.లక్ష మొత్తం మూడేళ్లలో రూ.1.27 లక్షలకు పెరుగుతుంది.
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు మూడేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.25 శాతం వడ్డీని అందిస్తోంది. పెట్టుబడి పెట్టిన రూ.లక్ష మొత్తం మూడేళ్లలో రూ.1.24 లక్షలకు పెరుగుతుంది.