మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannaah Bhatia)ప్రస్తుతం జోరు తగ్గిందనే చెప్పాలి.

ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోయిన ఈ చిన్నది ఇటీవల తెలుగులో సినిమాలు తగ్గించిందనే చెప్పాలి.

టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి ఆకట్టుకుంది తమన్నా. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది.

త్వరలో బబ్లీ బౌన్సర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 23న డిస్నీ+ హాట్‌స్టార్‌లో గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. తమన్నా మాట్లాడుతూ..

తెలుగు సినిమా అంటే నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. నా జర్నీ తెలుగు నుండే సార్ట్ ఆయ్యింది.

రాజమౌళి, సుకుమార్ లు అందరూ మన ఇండియన్ రూట్స్ కథలు తీసుకొని చేస్తుంటారు.

ఇప్పటికీ  మన ఇండియన్ సినిమాను మన  ఏమోషన్సే నడిపిస్తాయి అని అన్నారు తమన్నా.