శ్రుతిహాసన్‌లో యాక్టర్ మాత్రమే కాదు అద్భుతమైన సింగర్ కూడా ఉన్న విషయం తెలిసిందే.

అంతేకాదు తానే స్వయంగా పాటలు రాసి కంపోజ్ చేసి మెప్పిస్తుంటుంది.

తనలోని ఈ కోణాలన్నింటినీ ఇదివరుకే ప్రేక్షకులకు చూపించింది శ్రుతి.

అయితే ఇప్పుడామె రైటర్ గా మరో కొత్త ప్రయాణం మొదలుపెట్టేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తోందట.

ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడిస్తూ ‘‘కథ చెప్పే కళకు నేనెప్పుడూ అభిమానినే.

ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యేలా స్క్రిప్ట్‌ను రూపొందించడం నా కల. చిత్ర పరిశ్రమలో కొత్త ప్రయాణం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా.

త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశముంది’’ అని తెలిపింది.

ఆమె చెబుతున్న మాటల్ని బట్టి చూస్తే తనిప్పటికే ఓ కథతో సిద్ధంగా ఉన్నట్లు అర్థమవుతోంది.