బయట ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్ లో దుమ్మురేపుతున్న బ్యూటీస్ లో అందాల భామ శ్రీలీల కూడా ఒకరు.

ఆ ముద్దుగుమ్మ తన అందం, అభినయం, చలాకీ తనంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ప్రస్తుతం తెలుగులో మాస్ మహారాజ రవితేజ సరసన ధమాకా సినిమాలో చేస్తోంది.

ఈ సినిమా తర్వాత వైష్ణవ్ తేజ్ తో సినిమా చేస్తోంది శ్రీ లీల. అంతే ఇప్పుడు ఈ అమ్మడికి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయని తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ చిన్నదాని చేతిలో ఏకంగా ఏడు తెలుగు సినిమాలు ఉన్నాయని తెలుస్తోంది.

రవితేజ , బాలయ్య , వైష్ణవ్ , శర్వానంద్ , నితిన్ సినిమాల్లోనూ ఆమె హీరోయిన్ గా నటిస్తుండటం విశేషం.

అటు సీనియర్లతో పాటు ఇటు జూనియర్లు.. మరోవైపు అగ్రహీరోలతో జతకట్టనున్న ఈ బ్యూటీ క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతోంది.