తెలుగులో వరుస సినిమాలతో బిజీగా గడుపుతుంది అందాల తార శ్రీలీల.
బాలకృష్ణ, పవన్ కల్యాణ్ లాంటి స్టార్ హీరోలతో పాటు రామ్, నితిన్, వైష్ణవ్ తేజ్ లాంటి యువ హీరోలతోనూ నటిస్తుంది.
ఇదిలా ఉండే తాజాగా ఓ ప్రశ్నకు తనదైన శైలిలో బదులిచ్చింది శ్రీలీల.
అగ్ర హీరోల సినిమాల్లో చేయడం వల్ల ఏదైనా ప్రత్యేక ముద్ర పడుతుందని ఎప్పుడైనా భయం కలిగిందా? అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చింది శ్రీలీల.
‘‘సీనియర్లతో వరుస సినిమాలు చేసిందని ఒకలా.. యువ హీరోలతోనే చేస్తోందని మరొకలా ఓ ప్రత్యేక ఇమేజ్ ఆపాదించే రోజులు ఎప్పుడో పోయాయి.
జనం అసలలా ఆలోచించట్లేదు. చాలా అప్‌డేట్ అయ్యారు. ప్రాక్టికల్‌గా ఆలోచిస్తున్నారు. సినిమా అనేది ఒకరు సృష్టించిన కథ.
దాన్ని తెరపైకి తీసుకొస్తున్నారంటే అందులోని పాత్రలకు సరిగ్గా సరిపోయే తారల్నే ఎంచుకుంటారు.
మనకిచ్చిన ఆ పాత్రకు న్యాయం చేయగలుగుతున్నామా, లేదా? అన్నదే ప్రేక్షకులు చూస్తారు పక్కన ఉన్నది అగ్ర హీరోనా, యువ హీరోనా ఆలోచించారు.
వాళ్లకే కాదు ఏ ఆర్టిస్ట్‌కు ఈ ఆలోచన ఉండకూడదు. అసలు వయసును ఎప్పుడూ దృష్టిలోకి రానీయకూడదు’’ అని తెలిపింది శ్రీలీల.
ప్రస్తుతం తెలుగులో ‘గుంటూరు కారం’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘ఆదికేశవ’ చిత్రాలతో పాటు నితిన్, రామ్, విజయ్ దేవరకొండ సినిమాల్లో కూడా నటిస్తోంది శ్రీలీల.