దేశం అంతటా అభిమానుల్ని సంపాదించుకున్న హీరోయిన్ రష్మిక.

ప్రతికూలమైన అనుభవాలతో అప్పుడప్పుడూ బాధపడినా, ఏకాగ్రతతో మెలగడం మాత్రం మరవలేదని తెలిపింది ఆమె.

కెరీర్‌ ఆరంభంతో పోలిస్తే మీలో ఎలాంటి మార్పులు వచ్చాయని అడిగితే... ‘‘అప్పట్లో చిన్న చిన్న సమస్యలే పెద్ద కష్టాలుగా అనిపించేవి.

కానీ అనుభవాలు నా దృక్కోణాన్నే మార్చేశాయి. ఆలోచించి అడుగులేస్తే ప్రతి సమస్యకీ పరిష్కారం ఉంటుందని గ్రహించను.

క్రమపద్ధతిలో పనిచేయడాన్ని అలవాటు చేసుకున్నా. దాంతో సగం సమస్యలు తగ్గాయి.

వరుసగా సినిమాలు చేస్తున్నప్పుడు అలసటగా అనిపించేది. వ్యక్తిగత సమయం కూడా దొరకడం లేదే అనిపించేది.

కానీ ఇప్పుడు పలు భాషల్లో పనిచేస్తున్నా. ప్రయాణాలు, చిత్రీకరణలతో ఇదివరకటి కంటే బిజీగా గడుపుతున్నా.

కొత్త సవాళ్లు ఎదురయ్యేకొద్దీ ఒకప్పటి సమస్యలు అసలు సమస్యలే కాదు కదా అనిపిస్తోంద’’ని పేర్కొంది రష్మిక మందన్న.