ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ఎవరు అంటే టక్కున చెప్పే పేర్లలో రష్మిక మందన్న పేరు ఒకటి.

ఇక ఈ అమ్మడు తెలుగు రీసెంట్ గా చేసిన పుష్ప సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యింది అందరికి తెలిసిందే.

ఇదిలా ఉంటే అటు బాలీవుడ్ లోనూ వరుస అవకాశాలు అందుకుంటుంది. అలాగే తమిళ్ లో దళపతి విజయ్ నటిస్తున్న వారసుడు సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది రష్మిక.

తాజాగా ఫిట్నెస్ గురించి ఫిలాసఫీలు చెబుతూ వర్కౌట్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను అభిమానులకు తెలిపింది ఈ నేషనల్ క్రష్.

తాను ఎలాంటి మూడ్ లో ఉన్న జిమ్ లో వర్కౌట్స్ చేయడం వల్ల సంతోషం కలుగుతుందని అంటుంది రష్మిక.

తాను కోపంలో ఉన్న బాధలో ఉన్న సరే వర్కౌట్స్ మాత్రం తప్పకుండా చేస్తానని ఇలా వర్కౌట్ చేయడం వల్ల ఆ బాధ నుంచి తొందరగా బయటపడతానని తెలియజేశారు.

వర్కౌట్స్  చేయడం వల్ల ఫిట్ గా ఉండటమే కాదు మనసుకు కూడా హాయిగా ఉంటుందని అంటుంది రష్మిక.