ఇండస్ట్రీలో .. నిలబడటానికి ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉంది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్.

గ్లామర్ విషయంలో మాత్రం ఏమాత్రం తగ్గడంలేదు.

ఏజ్ పెరుగుతున్నా కొద్ది నాజూగ్గా తయారవుతుంది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్.

ఫిట్ నెస్ విషయంలో  ఏమాత్రం నిర్లక్ష్యం లేకుండా .. స్లిమ్ గా మెయింటేన్ చేస్తుంది ప్రగ్యా.

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తన ఫిట్ నెస్ సీక్రేట్ ను రివిల్ చేసింది బ్యూటీ.

చిన్నతనం న నుంచీ ఫిట్‌ గా ఉండటం అంతే తనకు ఎంతో ఇష్టం అంటుంది బ్యూటీ.

తన తండ్రి కూడా  యోగాసనాలు వేసేవారు. తమతోనూ చిన్నచిన్న వ్యాయామాలు చేయించేవారు.

ఇప్పటికీ నేను బరువులెత్తుతాను. పుషప్స్‌, స్కాట్స్‌ చేస్తాను. వారానికి అయిదు రోజులు.. రోజూ ఓ గంట వ్యాయామానికి తప్పకుండా  కేటాయిస్తాను.

నా దృష్టిలో నృత్యాన్ని మించిన కసరత్తు లేదు. కాబట్టే, రోజు విడిచి రోజు డ్యాన్స్‌ చేస్తాను.

ఓ డ్యాన్స్‌ ట్రూప్‌ ద్వారానే నేను సినిమాల్లోకి వచ్చాను. అందుకే నాట్యానికి ఎంతో రుణపడి ఉంటాను అన్నది బ్యూటీ.