ప్రతిభ విషయానికి వస్తే పూజా హెగ్డేలో ఎన్నో కోణాలు ఉన్నాయి.

ఆల్‌రౌండర్‌ అనిపించుకోవాలనే లక్ష్యంతోనే కెమెరా ముందుకొచ్చారా? అనే ప్రశ్నకు ఈ విధంగా బదులిచ్చారు.

‘‘కథలు చెప్పడానికే నేను ఇక్కడున్నది. సినిమాలో ఒక పాట కూడా ఓ కథ చెబుతుంది.

అందుకే నచ్చినప్పుడు పాటలూ చేస్తుంటా. చిన్నప్పుడు డాన్స్‌ చేయాలంటే బెరుగ్గా ఉండేది.

భరతనాట్యం నేర్చుకునేలా మా అమ్మ ప్రోత్సహించారు. అప్పట్నుంచి ఆడిపాడటాన్ని ఆస్వాదించడం అలవాటు చేసుకున్నా.

ఆ అలవాటు, ఇష్టమే ప్రత్యేక గీతాలపై ఆసక్తిని పెంచింది. ఇక నటన అంటారా? ప్రతి భాషలోనూ ఓ ప్రత్యేకమైన శక్తి కనిపిస్తుంటుంది.

అందుకే పలు భాషల్లో నటించడాన్ని గౌరవంగా భావిస్తుంటా. నటిగా నాకు ఇంకా చాలా లక్ష్యాలే ఉన్నాయి.

ముఖ్యంగా మహిళల్లో స్ఫూర్తిని నింపే పాత్రలు చేయాలని ఉంటుంది’’ అని తెలిపింది పూజా హెగ్డే.