అందాల పాయల్ రాజ్ పుత్‌కు పట్టరాని కోపం వచ్చింది.. ఏకంగా ఎయిర్ పోర్ట్ స్టాఫ్ పై చిర్రుబుర్రులాడింది పాయల్..

ఇంతకు అమ్మడికి అంతకోపం ఎందుకు వచ్చిందంటే..?

ఆర్ఎక్స్ 100 సినిమాతో పరిచయం అయిన పాయల్ తన అందంతో అభినయంతో కుర్రకారును కట్టిపడేసింది.

ముఖ్యంగా స్కిన్ షోకు ఏమాత్రం మొహమాట పడకుండా పాయల్ చేసిన పర్ఫామెన్స్ కు కుర్రకారు ఫిదా అయిపోయారు.

ముఖ్యంగా స్కిన్ షోకు ఏమాత్రం మొహమాట పడకుండా పాయల్ చేసిన పర్ఫామెన్స్ కు కుర్రకారు ఫిదా అయిపోయారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియా వేదికగా తనకు జరిగిన ఓ విషయాన్నీ అభిమానులతో పంచుకుంది.

ఇటీవ‌లే ఇండిగో విమానంలో పాయ‌ల్ రాజ్‌పుత్‌ ప్రయాణించింది. ఈ సంద‌ర్భంగా త‌న ల‌గేజీని ఇండిగో విమాన సిబ్బంది ఇష్టానుసారంగా విరిసిరేశారని పేర్కొంది.

తన లగేజ్ ను నిర్ల‌క్ష్యంగా విసిరిపారేశార‌ట‌. దీంతో త‌న ల‌గేజీ డ్యామేజీ అయ్యింద‌నిచెప్పుకొచ్చిన పాయల్… ఈ ప్ర‌యాణం త‌న‌కు ఎన్న‌డూ ఎదుర‌వ‌ని చేదు అనుభ‌వాన్ని మిగిల్చింద‌ని పేర్కొంది.