హీరో వెంకటేష్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ‘సైంధవ్’
శైలేశ్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు
ఇటీవలే లాంఛనంగా ప్రారంభం అయితే ఈ చిత్రం ఇప్పుడు రెగ్యులర్ షూటింగ్ కు సిద్ధమవుతోంది
ఈ సందర్భంగా ఇతర నటీనటుల్ని ఖరారు చేసే పనిలో పడింది మూవీ యూనిట్
ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్ నటించే అవకాశమున్న విషయం తెలిసిందే
ఈ చిత్రంలో ఓ పాత్ర కోసం హీరోయిన్ గా రుహాని శర్మను ఎంపిక చేసినట్లు సమాచారం
ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని, స్క్రిప్ట్ నచ్చడంతో చిత్రానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం
కాగా మిగతా ఇద్దరు హీరోయిన్స్ ఎవరన్నది త్వరలో స్పష్టత రానుంది
వినూత్నమైన యాక్షన్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈనెలలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది