సవ్యసాచి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది నిధిఅగార్వల్. తొలి సినిమాతోనే అందం అభినయం తో కట్టిపడేసింది ఈ చిన్నది.
ఇస్మార్ట్ శంకర్ సినిమాలో కావాల్సినంత గ్లామర్ షోతోనూ ఆకట్టుకుంది నిధి అగర్వాల్.
ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతుందని అంతా అనుకున్నారు.
కానీ అమ్మడు మాత్రం ఆచితూచి అడుగులువేస్తోంది.
ఇప్పటికే తమిళ్ లో జయం రవి సరసన , శింబుకు జోడీగా సినిమాలు చేసింది నిధి.
ఇక ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు లో ఛాన్స్ దక్కించుకుంది..
ఇక ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. హాట్ హాట్ ఫోటో షూట్స్‌తో అభిమానులను అలరిస్తోంది.