మలయాళీ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్(Nazriya Nazim). తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.

ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఎప్పుడెప్పడు నటిస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు నజ్రియా ఫ్యాన్స్.

ఆ కోరిక ఇప్పుడు నాని నటించిన అంటే సుందరానికి సినిమాతో నెరవేరింది.

ఇదే తరహాలో ఈ అమ్మడికి తెలుగు ఆఫర్స్ క్యూ కట్టాయి.. అయితే ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూ లో తెలుసు సినిమాల గురించి చెప్తూ..

తెలుగు సినిమాలు తనకు నచ్చుతాయి అని , అవకాశాలు మంచి కథలు వస్తే తప్పకుండ చేస్తా అని చెప్పింది

నాకు వెంటనే మరో తెలుగు సినిమా చేయాలని వుంది. మంచి స్క్రిప్ట్ రావాలని బలంగా కోరుకుంటున్నాను అన్నది.

తాజా సమాచారం ప్రకారం ఈ అమ్మడు మరో తెలుగు సినిమాలో నటించనుంది అని తెలుస్తుంది.