గురువారం హనుమాన్ జయంతిని సందర్భంగా నయనతార, ఆమె భర్త విఘ్నేశ్ శివన్ తంజావూరులోని తమ కులదైవం గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నయన్ దంపతులు వచ్చారని తెలిసి స్థానికులు అధిక సంఖ్యలో దేవాలయం వద్దకు చేరుకున్నారు.
పోలీసులు సైతం వారిని కంట్రోల్ చేయలేకపోవడంతో విఘ్నేశ్ శివన్ తమని ప్రశాంతంగా పూజ చేసుకోనివ్వమని అభిమానులకు అభివాదం చేసారు.
అయినా వారు మాట వినకపోవడంతో విసిగిపోయిన నయన్ పూజ అనంతరం అక్కడి నుంచి వెంటనే బయటకు వచ్చేసింది.
పలువురు అభిమానులతో ఫొటోలు కూడా దిగి తిరుగు ప్రయాణంలో ఆమె రైలులో ప్రయాణించింది.
అయితే, నయన్ రైల్లోకి ఎక్కిన వెంటనే ఓ అభిమాని ఆమెతో వీడియో తీసుకునేందుకు ప్రయత్నించాడు.
అప్పటికే కోపంగా ఉన్న నయన్ ఆ యువకుడి ప్రవర్తనతో అతనిపై ఫైర్ అయింది.
వీడియో తీయడం ఆపకపోతే ఫోన్ పగలకొట్టేస్తా అంటూ యువకుడిపై కేకలు వేసింది.