స్వయంవరం చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది లయ

ఆ తర్వాత మనోహరం, ప్రేమించు సినిమాలు ఆమెను స్టార్‌ హీరోయిన్‌ చేసాయి

దాదాపు 13 ఏళ్ల పాటు తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన ఆమె కెరీర్‌ పీక్‌లో ఉండగానే వివాహం చేసుకుని యాక్టింగ్ కు దూరమైంది

ప్రస్తుతం భర్త, పిల్లలతో కలిసి అమెరికాలో నివసిస్తున్న లయ సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది

అయితే ఇటీవల ఇండియా వచ్చిన లయ వరుసగా ఇంటర్య్వూలు ఇస్తున్న విషయం తెలిసిందే

ఈ సందర్భంగా అమెరికాలో తను చేసే జాబ్‌, శాలరీ గురించి ఆసక్తికర విషయాలు తెలిపింది ఆమె

కాగా తాను 2006లో పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిన లయ.. 2011 నుంచి ఐటీ జాబ్‌ చేసినట్లు తెలిపింది

ఆ సమయంలో తనకు ట్యాక్స్‌లు పోనూ 12000 డాలర్స్‌ శాలరీ వచ్చేదని ఆమె తెలిపింది

నాలుగేళ్లు జాబ్ చేసి 2017లో జాబ్‌ వదిలేసి డాన్స్‌ స్కూల్‌ పెట్టానని, కోవిడ్‌ కారణంగా అది మానేసి సోషల్‌ మీడియాలో రీల్స్‌ చేయడం మొదలుపెట్టానని ఆమె చెప్పుకొచ్చింది

ఇక చాలా ఏళ్ల తర్వాత ఇండియా వచ్చిన లయ హైదరాబాద్‌ చాలా మారిందని, న్యూయార్క్‌ సిటీ కంటే హైదరాబాదే చాలా బాగుందని పేర్కొంది