దర్శకుడు అరివళగన్, ఆది పినిశెట్టి కాంబినేషన్‌లో వచ్చిన 'వైశాలి' చిత్రం మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే

చాలా గ్యాప్‌ తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'శబ్దం'

లక్ష్మీమీనన్‌ కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రంతో దర్శకుడు అరివళగన్‌ నిర్మాతగాను మారడం విశేషం

అరివళగన్‌ ఆల్ఫా ఫ్రేమ్స్‌, సంస్థ 7జీ ఫిలింస్‌ శివ సంయుక్తంగా  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు

ఇప్పటికే సెట్స్ పై ఉన్న ఈ మూవీలో తాజాగా నటి లైలా చేరారు

కొన్నేళ్ల క్రితం తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ నటించి ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు లైలా

చాలా గ్యాప్‌ తర్వాత ఇటీవల కార్తీ హీరోగా నటించిన సర్దార్‌ మూవీలో ముఖ్యపాత్రలో సిల్వర్ స్క్రీన్ పై కనిపించారు లైలా

తాజాగా ఆది పినిశెట్టి, అరివళగన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న 'శబ్దం' చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నారు లైలా