ఇదే ఆఖరి అస్త్రం.. ఈ సినిమాతో కృతి శెట్టి జాతకం మారనుందా.?

Anil Kumar

31 May 2024

తెలుగులో హీరోయిన్ కృతి శెట్టి తెలియని వాళ్ళు ఉంటారా..! ఫస్ట్ మూవీతోనే యూత్ క్రష్ లిస్ట్ చేరిపోయింది కదా.

ఆ తరువాత కూడా వరస విజయాలను అందుకున్న ఈ వయ్యారికి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో తన స్పీడ్ కి కాస్త బ్రేక్ పడింది.

కొన్నాళ్లుగా హిట్స్‌కి దూరంగా ఉన్న బేబమ్మ.. ఈసారి తన ఆఖరి అస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధంగా ఉంది కృతి.

అయితే కృతి శెట్టికి అక్కినేని నాగ చైతన్య తో బంగార్రాజు మళ్లీ వచ్చాడు సినిమా వరకు మంచి జోరు మీద ఉంది..

ఆ తర్వాత వచ్చిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, వారియర్, మాచెర్ల నియోజకవర్గం, కస్టడీ మూవీస్ ఫ్లాపయ్యాయి.

దాంతో తన నెక్స్ట్ స్టెప్ కాస్త ఆచి తూచి వేసినట్టు తెలుస్తుంది కృతి.. శర్వానంద్ తో "మనమే" సినిమా చేస్తుంది.

'మనమే' సినిమా సక్సెస్ అటు కృతికి.. ఇటు శర్వా.. ఇద్దరి కెరీర్స్‌కు కీలకంగా మారిందని ఇండస్ట్రీలో చర్చ.

హీరో శర్వానంద్, కృతి శెట్టి జంటగా నటిస్తున్న ఈ మనమే చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.