‘ఉప్పెన’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది కృతిశెట్టి.
తర్వాత తెలుగులో వరస అవకాశాలు అందుకోవడమే కాదు తమిళంలోనూ సత్తా చాటే ప్రయత్నాల్లో చేస్తుంది ఈ భామ.
తాజాగా ఆమె నలన్ కుమార్‌స్వామి దర్శకత్వంలో కార్తి సరసన నటించనున్నట్లు తెలుస్తోంది.
ఇందులో ఓ హీరోయిన్ గా గాయత్రి భరద్వాజ్ నటించనుండగా మరో నాయికకీ చోటుంది.
ఆ పాత్ర చిత్రంలో కీలకం కానుండటంతో దాని కోసం కృతిని ఎంపిక చేసినట్లు సమాచారం.
త్వరలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారని అవకాశం ఉంది.
ప్రస్తుతం కార్తి ‘జపాన్’ సినిమా చిత్రీకరణలో బిజీగా గడుపుతున్నారు.
ఆయన కీలక పాత్రలో నటించిన ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.