ప్రస్తుతం కమల్‌హాసన్‌  శంకర్‌ దర్శకత్వంలో  ‘భారతీయుడు 2’ చిత్రంలో నటిస్తున్నారు.

ముగుంపు దశలో ఉన్న ఈ చిత్రంలో కాజల్ కథానాయక.

దీని తర్వాత తెరకెక్కబోయే కొత్త చిత్రం కోసం చకచకా ఏర్పాట్లు సాగుతున్నాయి.

అగ్ర దర్శకుడు మణిరత్నం ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఎన్నో ఏళ్ల తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న చిత్రమిది.

ఇదివరకు వీరి కాంబోలో  ‘నాయగన్‌’ చిత్రం వచ్చింది.

ఈ చిత్రంలో కమల్‌ సరసన విద్యాబాలన్‌ నటించనున్నట్లు సమాచారం.

ఇటీవలే విద్యాబాలన్‌ని కూడా సంప్రదదించినట్టు తమిళ సినీ వర్గాలు వెల్లడించాయి.