క్రేజీ బ్యూటీ హన్సిక దేశముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన విషయం తెలిసిందే.

చూడగానే ముద్దొచ్చే ఈ అమ్మడి రూపం ప్రేక్షకులకు ముఖ్యంగా యువతను బాగా ఆకట్టుకుంది

తెలుగులో స్టార్ హీరోల సరసన ఛాన్స్ దక్కించుకుంది ఈ బ్యూటీ.

బిజినెస్ పార్టనర్ సోహైల్ ఇకపై జీవిత భాగస్వామి కాబోతున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది హాన్సిక.

వీరి పెళ్లి వచ్చే నెల 4వ తేదీన జైపూర్ లోని ముందోటా ఫోర్ట్ అండ్ ప్యాలెస్ లో జరగనుంది.

కొద్దిరోజుల క్రితం తన కాబోయే భర్త ఫోటోస్ షేర్ చేసింది.

వీరి వివాహ వేడుక ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో లైవ్ స్ట్రీమింగ్ కానున్నట్టు తెలుస్తుంది.

ఇప్పటికే దీనికి సంబంధించి భారీ డీల్ కుదుర్చుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై క్లారిటీ అయితే రాలేదు