ముంబయిలో పుట్టిన హన్సిక బాలనటిగా కెరీర్ ప్రారంభించింది. హృతిక్ రోషన్ ‘కోయి మిల్ గయా’ చిత్రంలో నటించింది.

ఇది రిలీజైన నాలుగేళ్లకు అంటే 2007లో అల్లు అర్జున్ ‘దేశముదురు’తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

టీనేజ్ లోనే ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 15 ఏళ్లకు పైగా 50 సినిమాల్లో నటించింది.

కంత్రి, బిల్లా, కందిరీగ, దేనికైనా రెడీ, పవన్ తదితర సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ.. చివరగా 2019లో వచ్చిన తెనాలి రామకృష్ణ LLBలో హీరోయిన్ గా చేసింది.

 ప్రస్తుతం తెలుగు రెండు సినిమాలు కంప్లీట్ చేసిన హన్సిక.. తమిళంలో మరో నాలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

గతేడాది డిసెంబరు 4న సొహైల్ కతురియా అనే బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకుంది. ఈ వేడుకని చాలా గ్రాండ్ గా నిర్వహించారు.

 తాజాగా ఫుల్ చిల్ మోడ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మాల్దీవులకు విహారయాత్రకు వెళ్లిన ఆమె వరసగా ఫొటోలను పోస్ట్ చేస్తూనే ఉంది.

వీటిని చూసిన నెటిజన్స్.. పెళ్లి అయినా సరే హన్సిక రెచ్చిపోతూనే ఉందని మాట్లాడుకుంటున్నారు.