హీరోయిన్ అమలాపాల్‌కు కేరళలో చేదు అనుభవం ఎదురైంది
కేరళ రాష్ట్రం ఎర్నాకుళంలోని తిరువైరానికుళం మహాదేవి దర్శనానికి అమలాపాల్ వెళ్లారు
అయితే ఆమెను అధికారులు ఆలయం లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు
బయట నుంచే అమ్మవారిని దర్శనం చేసుకోవాలని అధికారులు తెలిపారు సూచించారు
ఈ గుడిలోకి హిందూ భక్తులకు మాత్రమే అనుమతి ఉంది
అమలాపాల్ క్రిస్టియన్ కావడంతో ఆమెను దర్శానికి అనుమతించలేదని తెలుస్తోంది
అయితే, అమ్మవారి దర్శనం అవకపోయిన తాను ఎంతో అసంతృప్తితో వెనుదిరిగినట్లు ఆలయ సందర్శకుల రిజిస్టర్‌లో తనకు కలిగిన చేదు అనుభవాన్ని ఆమె పేర్కొన్నారు
‘అన్యమతస్థురాలిని అని నాకు ఆలయంలోకి అనుమతి ఇవ్వలేదు. తీవ్ర నిరాశకు గురయ్యా. అయినా దూరం నుంచే అమ్మవారిని ప్రార్థించాను. 2023లో కూడా ఈ మత వివక్ష కొనసాగడం విచారకరం. త్వరలో ఈ మత వివక్షలో మార్పు వస్తుందని కోరుకుంటున్నా’ అని అమలాపాల్ రాసుకొచ్చింది