స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ ఉండగానే రణ్‌బీర్‌కపూర్‌ని పెళ్లి చేసుకుంది అలియాభట్‌.

ఆ తర్వాత వీరిద్దరూ ఓ పాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో అలియాకు ‘‘కెరీర్‌లో మంచి అవకాశాలు వస్తున్న సమయంలో తల్లి కావాలని ఎందుకు అనిపించింది? అనే ప్రశ్న ఎదురైంది

దీనిపై స్పందించిన అలియా ‘‘ఇదే ప్రశ్న మీరు హీరోలను ఎందుకు అడగరు.

ఇప్పటివరకూ పాపకు సంబంధించిన చాలా విషయాలను రణ్‌బీర్‌ను అడిగారు. కానీ ఎప్పుడూ ఈ ప్రశ్న ఆయన్ని అడగలేదు.

ఇలాంటి వాటిని హీరోయిన్లనే ఎందుకు అడుగుతారు. నేను కెరీర్‌ మొదలైన 10  సంవత్సరాలకు పిల్లల్ని కన్నాను.

ఈ విషయంలో చాలా ఆనందంగా ఉన్నాను. సినిమాలు, జీవితం...దేనిలోనైనా నేను ఏ నిర్ణయం తీసుకున్నా అది సరైంది అనిపిప్తేనే చేస్తాను.

నాకు నచ్చకుండా ఏ పనీ చేయను. నాకు నచ్చక పెద్ద సినిమాలు వదులుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

మరోసారి ఇలాంటి ప్రశ్న అడగకండి’’అని ఘాటుగా సమాధానం చెప్పింది అలియా.