ఈ మధ్య తమిళ హీరోలు తెలుగులో డైరెక్ట్ గా సినిమాలు చేస్తూ సందడి చేస్తున్నారు. 

దీనిలో భాగంగా కొంతమంది హీరోలు ఇప్పటికే అరంగ్రేటం చేయగా.. మరికొందరు ఎంట్రీకి సిద్ధంగా ఉన్నారు.

ఇప్పటికే “వారసుడు”తో ఇళయ దలపతి విజయ్ తెలుగు వారికి దగ్గరయ్యాడు. కార్తీ, సూర్య ఎప్పుడో తెలుగులో స్ట్రెయిట్ సినిమాలు చేసి అలరించారు.

ఇంకా ఈ లిస్టులో శివకార్తికేయన్, ధనుష్, విజయ్ సేతుపతి కూడా చేరిపోయారు.

తెలుగు వాళ్లకు ఎప్పటి నుంచో బాగా సుపరిచితుడైన విశాల్ మాత్రం ఇప్పటి వరకు ఒక్క స్ట్రెయిట్ సినిమా కూడా చేయలేదు

ఇన్నాళ్లకు విశాల్ తెలుగు ఎంట్రీకి ముహూర్తం కుదిరిందనే కథనాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా విశాల్ సొంత బ్యానర్ లో ఉండబోతుందట.

దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు వినికిడి. 2023 ద్వితీయార్ధంలో విశాల్ ఈ ప్రాజెక్ట్ గురించి ప్రకటించే అవకాశం ఉందట.