ఎలక్ట్రిక్ వాహనాల ధరలు పెరిగిపోతున్నాయి
హీరో మోటో కార్ప్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ ‘విదా వీ1 ప్రో ధర పెంచేసింది
కేంద్రం ఫేమ్-2 కింద టూ వీలర్స్‌కు సబ్సిడీ తగ్గించిన నేపథ్యంలో ధర పెంపు
విదా వీ1 ప్రో స్కూటర్ మీద సుమారు రూ.6000 ధర పెంచుతున్నట్లు హీరో మోటో కార్ప్ ప్రకటించింది
విదా వీ1 ప్రో ధర రూ.1,45,900గా ఉంది
ఢిల్లీ, అహ్మదాబాద్, సూరత్, వడోదర నగరాల పరిధిలో రూ.1,25,900లకే అందుబాటులో ఉంటుంది
పోర్టబుల్ చార్జర్‌తోపాటు ఫేమ్-2 సబ్సిడీ కలుపుకునే ఈ స్కూటర్ ధర కలిపి ఉంటుంది
ఎలక్ట్రిక్ టూ వీలర్స్‌కు ఫేమ్-2 కింద అందిస్తున్న సబ్సిడీని 40 శాతం నుంచి 15 శాతానికి తగ్గించేసింది కేంద్రం
ఒక్కో విద్యుత్ స్కూటర్‌కు ఒక కిలోవాట్ అవర్‌కు రూ.15వేల సబ్సిడీని రూ.10 వేలకు పరిమితం చేశారు