మెగా వారసుడు వరుణ్ తేజ్ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారు.
జూన్ 9న హైదరాబాద్‌లో హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం జరగనుంది.
ఈ విషయాన్ని వరుణ్ తేజ్ ప్రతినిధి ట్విట్టర్ ద్వారా తెలిపారు.
ఈ నిశ్చితార్థ వేడుకకు కుటుంబ సభ్యులు, కొంత మంది సినీ ప్రముఖుల మధ్య ఈ నిశ్చితార్థం జరగనుందని తెలుస్తోంది.
ఈ సంవత్సరం చివర్లో వీరిద్దరి పెళ్లి ఘనంగా జరగనున్నట్లు తెలుస్తోంది.
వరుణ్, లావణ్య ‘మిస్టర్’, ‘అంతరిక్షం’ కలిసి చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే.
ఈ చిత్రాల చిత్రీకరణ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టింది.
అప్పటి నుంచి వీరు ప్రేమలో ఉన్నారన్న వార్తలు వైరల అయినా సంగతి తెలిసిందే.
ఇక ఈ ప్రేమ జంట త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు.
ఇది తెలిసిన నెటిజన్లు వీళ్లిద్దరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.