యంగ్ హీరో తేజ సజ్జ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. దాదాపు అందరు స్టార్ హీరోల సినిమాల్లో నటించి అలరించాడు.
ఇక ఇప్పుడు హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు. జాంబీరెడ్ది సినిమాతో హీరోగా మారిన తేజ తొలి సినిమాతోనే మంచి హీట్ అందుకున్నాడు.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత తేజ రెండు మూడు సినిమాలు చేశాడు.
ఇక ఇప్పుడు మరోసారి ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా హను-మాన్ అనే టైటిల్ తో రానుంది.
ఇంతకంటే సూపర్ హీరో మనదగ్గర ఎవరున్నారు. సూపర్ హీరో అనగానే స్పైడర్ మాన్, సూపర్ మాన్ అని భావిస్తుంటారు. సినిమాలో చూసింది వాళ్ళనే. కానీ వాళ్ళు స్ఫూర్తిపొందింది
మన కల్చర్ నుండి, మన హనుమంతులవారి నుండి. వాళ్ళ సూపర్ హీరోలు ఫిక్షనల్ మాత్రమే. హనుమంతులవారు మన చరిత్ర. మన కల్చర్. ఇది మన సత్యం.
అలాంటి గొప్ప దేవుడు హనుమంతుడి అనుగ్రహంతో ఒక కుర్రాడికి సూపర్ పవర్ వస్తే ఏం చేస్తాడనేది మా హను -మాన్.