అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన సుశాంత్ కరెంట్ సినిమాతో హీరోగా వెండిత్రకు పరిచయం అయ్యాడు
మొదటి సినిమాతోనే ప్రేక్షకులను అలరించాడు సుశాంత్ తర్వాత హీరోగా సినిమాలు చేసినప్పటికీ అంతగా కలిసి రాలేదు
దాంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురంలో సినిమాలో సెకండ్ హీరోగా కనిపించి మెప్పించాడు సుశాంత్
ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న రావణాసుర సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించాడు సుశాంత్
తాజాగా మరో క్రేజీ ఆఫర్ కొట్టేసాడు సుశాంత్
మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘బోళా శంకర్’ చిత్రంలో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు సుశాంత్
సుశాంత్ పుట్టినరోజు పురస్కరించుకొని శనివారం ఈ విషయాన్ని ప్రకటిస్తూ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు మేకర్స్
‘‘యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న చిత్రం ‘బోళా శంకర్’. ఇందులో సుశాంత్‌ది లవర్‌బాయ్ తరహా పాత్ర’’ అని తెలిపింది చిత్రబృందం