ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా దక్షిణాది ఇండస్ట్రీని షేక్ చేసిన నటి నగ్మా.

తాజాగా ఆమె గురించి భోజ్ పూరి హీరో  చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

ఆమెతో తాను ఎప్పుడూ ప్రేమాయణం నడపలేదు అని పేర్కొన్నారు రవికిషన్.

అనేక భోజ్ పూరి సినిమాల్లో రవికిషన్, నగ్మా హీరో హీరోయిన్లుగా నటించించారు. భోజ్ పూరి సినిమాల్లో వీరిద్దరిది హిట్ జోడి.

తమ మధ్య మంచి కెమిస్ట్రీ ఉండడం వల్ల తమ చిత్రాలు హిట్ అయ్యాయని జనం పొరబడ్డారు అని రవికిషన్ తెలిపారు.

48 ఏళ్ల నగ్మా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా, ఇక రవికిషన్ బీజేపీ ఎంపీగా ఉన్నారు.

పార్టీలు వేరైనా తమ మధ్య స్నేహం ఉందని, కానీ మరే ఇతర బంధం లేదని పదే పదే రవికిషన్ చెప్పుకొచ్చారు.

అయితే ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా  ఉన్నప్పుడు ఆమె క్రికెటర్ గంగూలీతో డేటింగ్ చేశారు. వాళ్లిద్దరూ జంటగా శ్రీకాళహస్తిలో  పూజలు కూడా చేశారు.

అప్పటికే పెళ్లయిన గంగూలీ ఆమెని రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అని అప్పట్లో గట్టిగానే ప్రచారం జరిగింది.

కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వాళ్లిద్దరూ విడిపోయారు. కాగా  నగ్మా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉండిపోయారు.