మాస్ మహారాజా రవితేజ వరుస చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో వరుస విజయాలతో అందుకున్నారు. ఇటీవల ‘రావణాసుర’ అనే చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు.
రవితేజ నటించిన రావణాసుర మూవీ రీసెంట్ గా విడుదలై, ప్లాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
అయితే రవితేజ తాజాగా తన పారితోషికాన్ని భారీగా పెంచినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇంతకుముందు రవితేజ ఒక్కో మూవీకి 15 కోట్లు రెమ్యూనరేషన్ అందుకునేవారంట.
అయితే ప్రస్తుతం 25 కోట్లు నిర్మాతలను డిమాండ్ చేస్తున్నారట.
రవితేజ ప్రస్తుతం ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీ షూటింగ్ పూర్తి చేసి, నెక్స్ట్ మూవీ ‘ఈగల్’ షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు.