నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌  హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రాజెక్ట్‌ - కె’.

భారీ తారాగణంతో రానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు సినీ ప్రేమికులు.

కాగా తాజాగా ఈ చిత్రం గురించి నటుడు రానా అన్న మాటలకూ ప్రభాస్‌ అభిమానులు ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు.

తాజాగా ఓ కార్యక్రమంలో రానా ‘ప్రాజెక్ట్‌-కె’ గురించి మాట్లాడుతూ.. ‘‘మరికొన్ని రోజుల్లో ప్రభాస్‌ ‘ప్రాజెక్ట్‌-కె’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

తెలుగు ప్రేక్షకులంతా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ కచ్చింతంగా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవుతుంది.

ఇప్పటి వరకు ఉన్న ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రికార్డులను బ్రేక్‌ చేస్తుంది. నేనూ ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అని ఎంతో ఆతృతగా ఉన్నాను.

ఈ తెలుగు సినిమా గ్లోబల్‌ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటుందని నేను నమ్మకంగా ఉన్నాను.

టాలీవుడ్‌లో ఒక హీరో సినిమాను మరొక హీరో సపోర్ట్‌ చేస్తూ సెలబ్రెట్‌ చేసుకుంటుంటారు. ఇది చాలా గొప్ప విషయం.

ఇక భారతీయ చిత్రాలు విదేశాల్లోనూ సత్తా చాటుతున్నాయి. ప్రపంచ దేశాలన్నీ భారతీయ సంస్కృతిని ఎంతో గౌరవిస్తున్నాయి.

అలాగే మంచి కథతో వచ్చిన సినిమాకు ఎక్కడైనా ఆదరణ దక్కుతుంది’’ అని తెలిపారు రానా.