ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేటేస్ట్ చిత్రం ది వారియర్.
ఈ సినిమాకు తమిళ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వం వహించారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోస్ మూవీపై ఆసక్తిని క్రియేట్ చేశాయి.
తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా తర్వాత రామ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.