రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ భారీ సినిమాను చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది. ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదలకానున్నట్లు తెలుస్తోంది.

అయితే రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలియందికాదు.

ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకున్న ఈ సినిమా ఆస్కార్ అవార్డ్‌కు నామినేట్ అయ్యిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఈవెంట్ అటెండ్ అవ్వడం కోసం రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు.

ఇక అక్కడి మీడియా టాక్ ఈసీ పాడ్ కాస్ట్‌లో మాట్లాడుతూ.. రామ్ చరణ్ మరోసారి తన హాలీవుడ్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు.

ప్రస్తుతం కొన్ని స్టూడియోలతో చర్చలు జరుగుతున్నాయని.. రెండు మూడు నెలల్లో ఓ గుడ్ న్యూస్ రానుందని తెలిపారు.

దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇది విన్న మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.