సామాజిక కార్యక్రమాల్లో ఎప్పుడు ముందుంటారు ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్.
అయితే మరోసారి తన ఉదారత చాటుకున్నారు ఆయన.
లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే చాలమంది చిన్నారులకు సాయం చేసారు.
కాగా ఇప్పుడు 150 మంది చిన్నారులని దత్తత తీసుకున్నారు.
సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఆనందం వ్యక్తం చేశారు.
వారికి నాణ్యమైన విద్య అందించేలా కృషి చేస్తానని తెలిపారు రాఘవ లారెన్స్.
తన కొత్త చిత్రం ‘రుద్రుడు’ ఆడియో విడుదల కార్యక్రమంలో ఆ చిన్నారులతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.
ఇది తెలిసిన పలువురు అభిమానులు, నెటిజన్లు లారెన్స్‌ది గొప్ప మనసంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.