ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఓ నాలుగు సినిమాలను చేస్తున్నారు. అంతేకాదు వరుసగా ఆ సినిమాలను కూడా పూర్తి చేస్తున్నారు.

అది అలా ఉంటే ప్రభాస్ సడెన్‌గా అస్వస్థతకు గురౌయాడని తెలుస్తోంది.

ప్రస్తుతం ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని.. ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అంతేకాదు తాను ప్రస్తుతం చేస్తోన్న సినిమాల షూటింగ్‏కు బ్రేక్ చెప్పి మరీ ట్రీట్మెంట్ కోసం విదేశాలకు వెళ్లినట్లు టాక్ నడుస్తోంది.

మంగళవారం అర్ధరాత్రి నుంచి ప్రభాస్ ఆరోగ్యం బాగోలేదని, ఓ ప్రైవేట్ హాస్పిటల్‏లో చికిత్ర పొందుతున్నారని అయితే...

ఈవిషయంలో త్వరలో ఆయన మెరుగైన చికిత్స కోసం ఫారెన్‏కు వెళ్లనున్నట్లు ఓ వార్త హల్ చల్ చేస్తోంది.

ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాలి.